శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- September 11, 2025
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం భద్రత అధికారులు బుధవారం రూ.14కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ కు చెందిన సయ్యద్ రిజ్వీగా భద్రత అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి విలువ రూ.14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్, గంజాయి రవాణా కట్టడికి ప్రయత్నిస్తున్నప్పటికి రాష్ట్రంలో తరుచు గంజాయి, డగ్స్ దందాలు వెలుగు చూస్తున్న తీరు సమస్య తీవ్రతను చాటుతుందంటున్నారు నిపుణులు. ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లో రూ.12వేల కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం చూస్తే రాష్ట్రంలో మరింత భద్రత పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో
- నేపాల్: మళ్లీ కోలుకోవడం కష్టమే!
- భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్