ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- September 12, 2025
దోహా: దోహా మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో నిర్వహణ పనులు నిర్వహించడానికి వీలుగా ఈ వారాంతం నుండి పలు కీలక రోడ్లను మూసివేయనున్నట్లు ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ, అష్ఘల్ ప్రకటించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు.
సల్వా నుండి వాడి ముషైరెబ్ కూడలి వైపు వచ్చే జబుర్ బిన్ అహ్మద్ సర్కిల్ దగ్గర రెండు లేన్లను సెప్టెంబర్ 12 వ తేది తెల్లవారుజామున 2 గంటల నుండి సెప్టెంబర్ 13 ఉదయం 7 గంటల వరకు మూసివేయబడుతుంది.
లెజ్బైలాట్ ఇంటర్చేంజ్ నుండి అల్ మార్ఖియా స్ట్రీట్‌లోని ఒనైజా ఇంటర్చేంజ్ వైపు వచ్చే సింగిల్ లేన్ మరియు ఎడమవైపు యూటర్న్ లేన్ సెప్టెంబర్ 12న ఉదయం 2 గంటల నుండి సెప్టెంబర్ 13 ఉదయం 7 గంటల వరకు మూసివేయబడుతుంది. ట్రాఫిక్ ను లెఖ్వైర్ ఇంటర్చేంజ్ వైపు మళ్లిస్తారు.
మర్ఖియా ఇంటర్ చేంజ్ నుండి టెలివిజన్ సర్కిల్ వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం అల్-జామియా వీధిలోని రెండు ఎడమ లేన్లను పూర్తిగా మూసివేస్తారు. సెప్టెంబర్ 13వ తేది రాత్రి 11 గంటల నుండి సెప్టెంబర్ 18వ తేది ఉదయం 5 గంటల వరకు వాహనాలను దారి మళ్లిస్తారు.
అల్-జామియా స్ట్రీట్ లోని వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సర్కిల్స్ వద్ద కుడి లేన్లను ఉపయోగించుకోవాలని అష్ఘల్ కోరింది.
ఇక వాహనదారులు అధికారిక స్పిడ్ లిమిట్స్ ను కచ్చితంగా పాటించాలని, రోడ్డుపై పెట్టే సిగ్నల్స్ ను అనుసరించాలని, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని వాహనదారులను అష్ఘల్ కోరింది.
తాజా వార్తలు
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్‌పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!