సినిమా రివ్యూ: ‘కిష్కింధపురి’.!

- September 12, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘కిష్కింధపురి’.!

రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) లవర్స్. ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్‌ టూర్స్ చేస్తుంటారు వీరిద్దరూ కలిసి. ఈ టూర్స్‌లో ఆ తరహా ఇంట్రెస్ట్ వున్నవాళ్లని జాయిన్ చేసుకుంటూంటారు. అలా నిర్మానుష్యమైన ప్రదేశాలకు తీసుకెళ్లి అక్కడ దెయ్యాలున్నాయని నమ్మించి వారికి థ్రిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అలా కిష్కింధపురి అనే గ్రామంలోని ‘సువర్ణమాయ’ అనే ఓ పాడుబడిన రేడియో స్టేషన్‌కి కొందరు వ్యక్తుల్ని తీసుకెళతారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అందులో ముగ్గురు వ్యక్తులు చనిపోతారు. ఓ చిన్నపాప దెయ్యానికి ఎఫెక్ట్ అవుతుంది. మరి, నిజంగానే ఆ సువర్ణమాయ రేడియో స్టేషన్‌లో దెయ్యం వుందా.? వుంటే ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ ఏంటీ.? ఆ దెయ్యం బారి నుంచి పాపని రక్షించడానికి హీరో రాఘవ్ ఏం చేశాడు.? తెలియాలంటే ‘కిష్కింద‌పురి’ సినిమాని ధియేటర్లలో చూసి థ్రిల్ ఫీలవ్వాల్సిందే.

నటీనటుల పని తీరు:                                                                                                           బెల్లంకొండ  సాయి శ్రీనివాస్‌ హారర్ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. ఓకే తనకున్న పరిధిలో బాగానే నటించాడు. కానీ, పూర్తిగా మెప్పించాడా.? లేదా.? అనే విషయం ఆడియన్స్‌కే వదిలేయాలి. అయితే, ఈ సినిమా చూసినంతసేపూ మొబైల్ ఫోన్స్ పట్టుకోరు.. ఒకవేళ అలా పట్టుకుంటే, తాను ఇండస్ట్రీని వదిలేస్తా.. అంటూ కాస్త సీరియస్‌గానే కామెంట్స్ చేసేశాడు ప్రమోషన్స్‌లో. అయితే, ఆ స్థాయి థ్రిల్‌ని ఈ సినిమా పంచిందా.? నిజంగానే ఆడియన్స్ మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టేసి ఫోకస్‌డ్‌గా ఈ సినిమాని చూశారా.? అనే సంగతి కూడా చెప్పలేమనుకోండి.. ఆ మాటల్లోని అర్ధం, పరమార్ధం బెల్లంకొండకే తెలియాలి. సహజంగానే దెయ్యాల సినిమాలంటే  ఇలా వుంటాయన్న ఐడియా సగటు ప్రేక్షకుడికి వచ్చేసింది. అయితే, ఈ సినిమాలో దర్శకుడు అక్కడక్కడా ఒకింత థ్రిల్ పంచే అంశాలను యాడ్ చేశాడనే చెప్పొచ్చు. కానీ, చాలా చోట్ల రొటీన్ దెయ్యాల సినిమానే.. అనే అభిప్రాయం రాక మానదు. ఇక, అనుపమా పరమేశ్వరన్‌కి మంచి స్కోప్ వున్న పాత్ర దక్కింది. ఫస్టాఫ్‌లో రెగ్యులర్ పాత్రలానే అనిపించినా.. సెకండాఫ్‌లో దెయ్యం పాత్రలో నేచురల్‌గా అలవోకగా నటించేసింది. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సీనియర్ నటి ప్రేమ పాత్ర ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజింగ్ రోల్. తనికెళ్ల భరణి, మకరంద్ దేశ్ పాండే, సుదర్శన్, హైపర్ ఆది తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంది. అలాగే కథనాన్ని నడిపించడంలో ఇంకాస్త స్పీడ్ చూపించి వుంటే బాగుండేది. దెయ్యం ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి ఎమోషన్ బాగానే పండింది. కానీ, కొన్నిచోట్ల లాజిక్కుల్లేని సన్నివేశాలు బోరింగ్ అనిస్తాయ్. కావల్సినంత ఎమోషన్, డెప్త్ వుంది కథకి. కానీ, దాన్ని పూర్తి స్థాయిలో తెరపై ఆవిష్కరించలేకపోయాడు. కానీ, ప్రయత్నించాడు. అయితే, సినిమాకి ‘కిష్కిందపురి’ అనే టైటిల్ నాట్ యాప్ట్ అన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్. ‘సువర్ణ మాయ రేడియో స్టేషన్’ అని టైటిల్ పెట్టి వుంటే బాగుందనిపిస్తుంది. కొంచెం కొత్తగా వుండేదేమో కూడా.  హారర్ఈ సినిమాకి ప్రాణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజికే.  సినిమాలోని హారర్ ఎలిమెంట్స్‌కి తగ్గట్లుగా బీజీఎమ్ ఆకట్టుకోలేదనిపిస్తుంది.జస్ట్ ఓకే అనేలా వుంటుంది. దాంతో, థ్రిల్లింగ్ అంశాలూ, జమ్‌స్కేర్‌లు మిస్ అవుతారు ఆడియన్స్. సినిమాటోగ్రఫీ బాగుంది. నేచురల్‌గా అనిసిస్తాయ్ విజువల్స్. ఎడిటింగ్ ఇంకాస్త పదును పెడితే బాగుంటేంది. నిర్మాణ విలువలు ఓకే. 

ప్లస్ పాయింట్స్:                                                                                                         అనుపమ పర్‌‌ఫామెన్స్, విజువల్స్, కొన్ని కొన్ని కొత్తగా అనిపించిన థ్రిలంగ్ ఎలిమెంట్స్ (సెకండాఫ్‌లో)

మైనస్ పాయింట్స్:
వీక్ నెరేషన్, రొటీన్ హారర్ ఎలిమెంట్స్.. 

చివరిగా:
‘కిష్కింధపురి’.. లాజిక్స్ అడక్కుండా హారర్ థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడే వాళ్లు ధియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com