సినిమా రివ్యూ:’మిరాయ్‘

- September 12, 2025 , by Maagulf
సినిమా రివ్యూ:’మిరాయ్‘

’హనుమాన్‘ సినిమా తర్వాత తేజ సజ్జా నుంచి వచ్చిన సినిమానే ’మిరాయ్‘. హనుమాన్ ఘన విజయం సాధించడంతో ఆటోమెటిగ్గా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయ్. దానికి తోడు ఈ సినిమాని సూపర్ హీరో సినిమాగా అభివర్ణిస్తుండడం మరో ప్లస్. ప్రమోషన్లు నెక్స్ట్ లెవల్ చేశారు. బాగా కష్టపడ్డాడు. ’ఈగల్‘ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాని తెరకెక్కించాడు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సినిమా ఉన్నతంగా కనిపిస్తోంది ప్రచార చిత్రాల ఆధారంగా. మరి, ధియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో తెలిసుకునే ముందు సినిమా కథలోకి వెళ్దాం.

కథ:
పౌరాణిక నేపథ్యం నుంచి ఈ సినిమా కథకు లీడ్ తీసుకున్నాడు దర్శకుడు. కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపానికి గురైన అశోకుడు తనలోని శక్తులన్నింటినీ 9 గ్రంధాల్లోకి ఇనుమడింపచేసి, ప్రపంచ నలుమూలలా 9 మంది రక్షకులకి అప్పగిస్తాడు. అలా 9 గ్రంధం నుంచి ప్రస్తుత కథకి లింక్ కలిపాడు. ప్రస్తుత కథలో 9వ గ్రంధానికి అంబిక (శ్రియా శరణ్) రక్షణగా వుంటుంది. శ్రియ కొడుకు వేద (తేజ సజ్జా). తన తర్వాత ఆ గ్రంధాన్ని రక్షించే బాధ్యత వేదపై వుంటుంది. ఈ క్రమంలోనే ఈ మహా దివ్య గ్రంధాన్ని చేజిక్కించుకుని ప్రపంచాన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలనీ, భగవంతుడిగా తనను తాను ప్రపంచానికి చూపించుకోవాలన్న దుర్భుద్ధితో వుంటాడు మహా వీర్ (మంచు మనోజ్). మరి, ఆ దుష్టుడి నుంచి వేద దివ్య గ్రంధాన్ని కాపాడడానికి ఏం చేశాడు.? అందుకు రాముడి కాలం నాటి మిరాయ్ (దివ్య ఆయుధం) ఎలా సహకరించింది.? ఆ ఆయుధాన్ని దక్కించుకోవడానికి వేద, యోధలా ఎలా మారాడు.? అసలు మహావీర్ గతం ఏంటీ.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే ’మిరాయ్‘ బిగ్ స్క్రీన్ పై  చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
ఆల్రెడీ సూపర్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు తేజ సజ్జా తొలి సినిమా ’హనుమాన్‘తో. ఈ సినిమా ఆ సార్ధక నామాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. వేద మరియు యోధ పాత్రల్లో తన లుక్స్, ఆటిట్యూడ్ బాగా సెట్ అయ్యాయ్. ఆ విషయంలో మాటల్లేవ్ మాట్టాడుకోవడాల్లేవ్. మంచు మనోజ్ మహావీర్ పాత్రలో తనదైన గాంభీర్యాన్ని చూపించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మనోజ్ మంచి పాత్రలే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మొన్న ‘భైరవం’.. ఇప్పుడు ‘మిరాయ్’. మరో చెప్పుకోదగ్గ పాత్ర శ్రియ. అంబికగా చాలా హుందా అయిన పాత్రలో కనిపించి మెప్పించింది. హీరోయిన్ రితికా నాయిక్ తనకున్న పరిధిలో తనదైన పర్‌ఫామెన్స్ ఇచ్చింది.గెటప్ శీనుకి తేజ సజ్జా కాంబినేషన్‌లో ‘హనుమాన్’ తర్వాత మరో మంచి పాత్ర దక్కింది.  జగపతిబాబు, జయ రాం తదితరులు తమ పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి సాంకేతిక వర్గమే పెద్ద ప్లస్ పాయింట్. ఈ తరహా సినిమాలు తీయాలంటే బడ్జెట్ భారీగా వుండాలి.. అనే ఆలోచన నుంచి లిమిటెడ్ బడ్జెట్‌లో కూడా ఇంత పర్‌ఫెక్ట్ అవుట్ పుట్ ఇవ్వొచ్చు అని ప్రూవ్ చేసుకున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని చోట్ల విజువల్స్ విజిల్స్ వేయిస్తాయ్. అలాగే, ఆ బడ్జెట్‌ రేంజ్‌లో ఈ రేంజ్ విజువలా.? అని ఆశ్చర్యపరుస్తాయ్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని బేసిగ్గా కెమెరా‌ మేన్ కాబట్టి.. ఆ పనితనం పర్‌ఫెక్ట్‌గా వుండేలా చూసుకున్నాడు. ఎడిటింగ్ బాగుంది. అక్కడక్కడా కొంత మేర సాగతీత అనిపించినా ఓవరాల్‌గా ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి పనితనం ఈ సినిమాకి మరో మెయిన్ అస్సెట్. కొన్ని కొన్ని సన్నివేశాల్నీ, యాక్షన్ ఎపిసోడ్స్‌నీ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో నెక్స్‌ట్ లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. అయితే, సినిమా లెంగ్త్ దృష్టిలో పెట్టుకుని ‘వైబున్నదే పిల్లా.. ’ సాంగ్‌ని సినిమాలో లేపేయడం కొంత మేర లోటుగా అనిపిస్తుంది కమర్షియల్ యాంగిల్ దృష్ట్యా. విజువల్స్ సూపర్బ్. నిర్మాణ విలువల గురించి ముందే చెప్పుకున్నాం కదా. ఆ బడ్జెట్‌లో ఎక్స్‌లెంట్ వర్క్. టోటల్లీ టెక్నికల్ టీమ్ వర్క్ సింప్లీ సూపర్బ్.

ప్లస్ పాయింట్స్:
తేజ సజ్జా, మంచు మనోజ్ పర్‌ఫామెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రంధాల శక్తిని దక్కించుకునే క్రమంలో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్.. సాహస ఘట్టాలు, చాలానే వున్నాయ్ విజువల్ ఎఫెక్టులు..

మైనస్ పాయింట్స్:
ఒక సాంగ్ లేపేయడం, ఫస్టాఫ్‌లో కొంత సాగతీతలా అనిపించిన సన్నివేశాలు, అక్కడక్కడా కొన్ని మాత్రమే.. 

చివరిగా:
‘మిరాయ్’ తేజ సజ్జా అకౌంట్‌లో మరో విజువల్ వండర్. ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com