ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!

- September 12, 2025 , by Maagulf
ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!

సోచి: ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని రష్యాలోని సోచి నగరంలో జరిగిన గల్ఫ్ సహకార మండలి (GCC) మరియు రష్యన్ ఫెడరేషన్ 8వ మంత్రివర్గ సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఖతార్ సార్వభౌమాధికారంపై దాడి.. మిడిలీస్ట్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని సాధించడానికి ఉద్దేశించిన దౌత్య ప్రయత్నాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కడం అని సమావేశం సంయుక్త ప్రకటనలో స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్‌ను నిరోధించడానికి, అంతర్జాతీయ శాంతి మరియు భద్రతా సూత్రాలను పదే పదే ఉల్లంఘించడాన్ని అడ్డుకోవడానికి అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  అంతర్జాతీయ సమాజం, UN భద్రతా మండలి తమ బాధ్యతలను పటిష్టంగా అమలు చేయాలని వక్తలు కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com