ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- September 12, 2025
దోహా: ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా ఖతార్ సార్వభౌమత్వం మరియు ప్రాదేశిక సమగ్రతకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులు మద్దతు తెలిపారు. భద్రతా మండలి "మధ్యప్రాచ్యంలో పరిస్థితి" అనే అజెండా కింద అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
సెప్టెంబర్ 9న దోహాలో ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖండించాలని అల్జీరియా, పాకిస్తాన్ మరియు సోమాలియా ఈ సమావేశాన్ని కోరాయి. దీనికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ మద్దతు ఇచ్చాయి. ఈ సమావేశానికి దక్షిణ కొరియా అధ్యక్షత వహించింది.
"సెప్టెంబర్ 9న ఖతార్‌లోని దోహాలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి" అని రాజకీయ, శాంతి వ్యవహారాల అండర్-సెక్రటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో తన బ్రీఫింగ్లో తెలిపారు. దీనిని భయంకరమైన దురాక్రమణగా అభివర్ణించారు. ముఖ్యంగా గాజాలో కాల్పుల విరమణ , బందీల విడుదల ఒప్పందం కోసం యునైటెడ్ స్టేట్స్ చేసిన తాజా ప్రతిపాదనను చర్చించడానికి కృషి చేస్తున్న ఖతార్ ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.
కాగా, అమెరికా ఈ వాదనను ఖండించింది. ఇజ్రాయెల్ దాడిలో హమాస్, దాని ప్రధాన మెంబర్ కుమారుడు, అలాగే అతని కార్యాలయ మేనేజర్, మరో ముగ్గురు చనిపోయారని తెలిపింది. ఈ దాడి నుంచి హమాస్ సీనియర్ నాయకత్వం తప్పించుకుందని వివరించారు.
కాగా, అంతర్జాతీయ చట్టం లేనట్లుగా, సరిహద్దులు లేవన్నుట్లుగా UN చార్టర్ ఒక అభూత కల్పన లా భావించి ఇజ్రాయెల్ ప్రవర్తిస్తుందని ఖతార్ అనుకూల దేశాలు మండిపడ్డాయి. రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్.. సిరియా, లెబనాన్, యెమెన్, ఖతార్‌లపై దాడికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తి చేశారు. ఆధిపత్య ధోరణి అనేది ఎప్పటికీ శాంతిని లేదా స్థిరత్వాన్ని ఇవ్వదని హెచ్చరించాయి. ఇంకా ఆలస్యం కాకముందే ఆంక్షలతో సహా అన్ని సాధనాలను ఉపయోగించి, ఇజ్రాయెల్ దురాక్రమణను నిరోధించాలని కౌన్సిల్‌ను ఆయా దేశాల ప్రతినిధులు కోరారు.
ఇజ్రాయెట్ దాడిని తప్పుబడుతూ.. ఖతార్ కు మద్దుతుగా నిలిచిన దేశాల్లో పాకిస్తాన్, డెన్మార్క్, యునైటెడ్ కింగ్డమ్, సియెర్రా లియోన్, ఫ్రాన్స్, రష్యా, సోమాలియా, పనామా, చైనా ఉన్నాయి.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్