ధనుష్ తొలిసారిగా తెలుగు పాట పాడాడు..

- July 19, 2016 , by Maagulf
ధనుష్ తొలిసారిగా తెలుగు పాట పాడాడు..

గతంలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాట పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మరోసారి అలాంటి కాంబినేషన్ నే సెట్ చేశాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ తిక్క. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో ధనుష్ పాట పాడాడు.ఇప్పటి వరకు తమిళ పాటలు మాత్రమే పాడిన ధనుష్ తొలిసారిగా తిక్క సినిమా కోసం తమన్ సంగీత సారధ్యంలో తెలుగు పాట పాడాడు. ఇప్పటికే కోలీవుడ్ లో కొలవర్రీ పాటతో సెన్సేషన్ సృష్టించిన ధనుష్, ఇప్పుడు తిక్క బేబి అంటూ సాగే పాటతో తెలుగు నాట కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.గతంలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాట పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మరోసారి అలాంటి కాంబినేషన్ నే సెట్ చేశాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ తిక్క. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో ధనుష్ పాట పాడాడు.ఇప్పటి వరకు తమిళ పాటలు మాత్రమే పాడిన ధనుష్ తొలిసారిగా తిక్క సినిమా కోసం తమన్ సంగీత సారధ్యంలో తెలుగు పాట పాడాడు. ఇప్పటికే కోలీవుడ్ లో కొలవర్రీ పాటతో సెన్సేషన్ సృష్టించిన ధనుష్, ఇప్పుడు తిక్క బేబి అంటూ సాగే పాటతో తెలుగు నాట కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com