రోహిత్‌ మిస్టర్‌ వరల్డ్‌గా తొలి భారతీయుడు..

- July 20, 2016 , by Maagulf
రోహిత్‌ మిస్టర్‌ వరల్డ్‌గా తొలి భారతీయుడు..

మిస్టర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయుడు టైటిల్‌ సాధించాడు. ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన మిస్టర్‌ వరల్డ్‌ ఫైనల్స్‌లో 46 మంది అభ్యర్థులతో పోటీపడి హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌ ఖండేల్వాల్‌ 2016 మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కింద రోహిత్‌ 50వేల డాలర్ల నగదు బహుమతిని అందుకున్నాడు. మిస్టర్‌ వరల్డ్‌ టైటిల్‌తో పాటు.. ప్రపంచ మల్టీమీడియా అవార్డు, ప్రపంచ టాలెంట్‌, మాబ్‌స్టార్‌ పీపుల్స్‌ ఛాయిస్‌ లాంటి సబ్‌టైటిళ్లకు కూడా రోహిత్‌ పోటీ పడ్డాడు.
26ఏళ్ల రోహిత్‌ ప్రముఖ బుల్లితెర నటుడు, మోడల్‌గా సుపరిచితుడు. బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌తో కలిసి ఓ యాడ్‌లో నటించిన రోహిత్‌.. తర్వాత పలు హిందీ సీరియల్స్‌లో నటించాడు. 2015లో మిస్టర్‌ ఇండియాగా ఎంపికయ్యాడు. మిస్టర్‌ వరల్డ్‌గా ఓ భారతీయుడు ఎంపికవడం ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com