AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!

- September 18, 2025 , by Maagulf
AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!

మనామా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ముఖ్యమైన రంగాలలో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం పెంచేందుకు అవసరమైన చర్యలను బహ్రెయిన్‌లో భారత రాయబారి వినోద్ కె జాకబ్ స్వాగతించారు.  బహ్రెయిన్ ఇండియా సొసైటీ, అల్మోయ్యద్ కంప్యూటర్స్ మిడిల్ ఈస్ట్ సహకారంతో బహ్రెయిన్‌లో సెప్టెంబర్ 14న నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 2026లో న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో బహ్రెయిన్ కు చెందిన ఐటీ, ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.  

ఇండియాను సందర్శించడానికి బహ్రెయిన్ జాతీయుల కోసం ఎలక్ట్రానిక్ వీసా వ్యవస్థను ప్రారంభించినట్టు గుర్తుచేశారు. బహ్రెయిన్ మాల్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ప్రారంభమైందని, అలాగే కాన్సులర్ సేవలకు సంబంధించిన సేవా రుసుములపై 5 నుండి 6 శాతం తగ్గింపు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో CMF సహకారంతో ప్రాంతీయ భద్రతకు ఇండియన్ నావల్ షిప్ తార్కాష్ సహకారంతో ఇండియా-బహ్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవలి పరిణామాలను రాయబారి జాకబ్ హైలైట్ చేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com