పాకిస్తాన్ సంచలన నిర్ణయం..

- September 17, 2025 , by Maagulf
పాకిస్తాన్ సంచలన నిర్ణయం..

దుబాయ్: ఆసియా కప్ 2025లో హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ అంశం మలుపులు తిరుగుతోంది. పాకిస్తాన్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగే చివరి గ్రూప్-దశ మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ జట్టుకి కీలక ఆదేశాలు ఇచ్చింది.హోటల్‌లోనే ఉండాలని, స్టేడియానికి వెళ్లొద్దని ఆదేశించింది. ఆటగాళ్లు తమ తమ గదుల్లోనే ఉండాలంది. వారి కిట్‌లు, లగేజ్.. జట్టు బస్సులోనే ఉండాలని సూచించింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ముందు రెండు డిమాండ్లు పెట్టింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్ సమయంలో అధికారిక విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. రెండవ డిమాండ్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి. సూర్యకుమార్ యాదవ్ రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పీసీబీ ఆరోపించింది. యాదవ్ వ్యాఖ్యలు క్రీడా స్ఫూర్తిని, ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని వాదించింది. బోర్డు క్రమశిక్షణా చర్య తీసుకోవాలని కోరింది.

పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు సభ్యులు హోటల్ లాబీలో వేచి ఉన్నారు. వారి లగేజీని ఇప్పటికే జట్టు బస్సులో లోడ్ చేశారు. రాబోయే మ్యాచ్‌లపై అనిశ్చితి కొనసాగుతున్నందున, ఆటగాళ్లు PCB నుండి తుది సూచనల కోసం వేచి ఉన్నారు.

భారత కాలమానం ప్రకారం రాత్రి గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ పై అనిశ్చితి నెలకొంది. యూఏఈ జట్టు ఇప్పటికే స్టేడియంకు బయలుదేరినా.. పాకిస్తాన్ జట్టు గైర్హాజరు కావడం ఉత్కంఠ రేపుతోంది.

పైక్రాఫ్ట్‌ను అధికారిక విధుల నుండి తొలగించడానికి PCB చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ అధికారిక అభ్యర్థన చేసినా.. అనుభవజ్ఞుడైన రిఫరీని తొలగించడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిరాకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com