కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!

- September 18, 2025 , by Maagulf
కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!

కువైట్: కువైట్ లో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా పదవి కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అమిరి దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా ను బయాన్ ప్యాలెస్‌లో మర్యాద పూర్వకంగా కలిసారు.  ఈ సందర్భంగా కువైట్‌లో తన సర్వీస్ కాలంలో ఆదర్శ్ స్వైకా చేసిన కృషిని షేక్ హమద్ జాబర్ అల్-అలీ ప్రశంసించారు.  రెండు స్నేహపూర్వక దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన చేసిన అత్యుత్తమ సహకారాన్ని కొనియాడారు. డాక్టర్ స్వైకా తన భవిష్యత్ ప్రయత్నాలలో నిరంతర విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com