సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!

- September 18, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!

రియాద్: 2026 నుండి 2029 వరకు వచ్చే నాలుగు సంవత్సరాలకు సంబంధించిన సెలవుల జాబితాను సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ప్రకటించింది.   

ఈద్ అల్-ఫితర్ కోసం వచ్చే ఏడాది మార్చి 17 నుండి మార్చి 23 వరకు సెలవులు రానున్నాయి. 2027కు సంబంధించి మార్చి 7 నుండి మార్చి 11 వరకు , 2028 సంవత్సరంలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 2వ తేది వరకు; 2029 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 18 వరకు అధికారిక సెలవులు ఉంటాయి.

ఈద్ అల్-అధా ను పురస్కరించుకొని వచ్చే ఏడాది మే 24 నుండి మే 28 వరకు సెలవులు ప్రకటించారు. ఇక 2027లో మే 16 నుండి మే 20 వరకు; 2028లో మే 3 నుండి మే 9 వరకు; 2029లో ఏప్రిల్ 22  నుండి ఏప్రిల్ 26 వరకు సెలవులు రానున్నాయి.

వీటితోపాటు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకునే సౌదీ జాతీయ దినోత్సవం,  ఫిబ్రవరి 22న వ్యవస్థాపక దినోత్సవం అధికారిక సెలవు దినాలుగా పేర్కొన్నారు. ఏవైనా హాలీడేలు శుక్రవారం వస్తే, ఆ సెలవుదినాన్ని గురువారంకు, అదే శనివారం వస్తే, ఆ సెలవుదినాన్ని ఆదివారంకి మారుతుందని పేర్కొన్నారు.

రమదాన్ సందర్భంగా బ్యాంకులు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పనిచేస్తాయి. రెమిటెన్స్ కేంద్రాలు మరియు చెల్లింపు సేవా కేంద్రాలు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఆరు గంటల పాటు అనువైన షిఫ్ట్‌లను నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com