అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!

- September 19, 2025 , by Maagulf
అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!

దోహా: అల్ వక్రా రోడ్డును పాక్షికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. రాస్ బు ఫోంటాస్ ఇంటర్‌చేంజ్ తర్వాత దోహా నుండి అల్ వక్రా వైపు వచ్చే ట్రాఫిక్ కోసం 300 మీటర్ల దూరం వరకు ఫాస్ట్ లేన్ మూసివేయబడుతుంది.

ఈ మూసివేత నిర్ణయం సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమై 40 రోజుల పాటు అమలులో ఉంటుంది. దోహా నుండి అల్ వక్రా వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ ను అనుసరించాలని, నిర్ణయించిన స్పిడ్ లిమిట్స్ ను పాటించాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com