'శివ' 4K డాల్బీఆట్మాస్ రీ-రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన నాగార్జున
- September 21, 2025
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా 'శివ' 4K డాల్బీఆట్మాస్ రీ-రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన కింగ్ నాగార్జున- నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్.
1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. ఇండియన్ సినిమాను 'బిఫోర్ శివ' & 'ఆఫ్టర్ శివ' గా రీడిఫైన్ చేసిన శివ గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
నాగార్జున మాట్లాడుతూ.. నాన్నగారు ఎప్పుడూ సినిమాకి తరాలకు మించి జీవించే శక్తి ఉందని నమ్మారు. శివ అలాంటి ఒక చిత్రం. నవంబర్ 14న 'శివ' పూర్తిగా కొత్త అవాతర్ లో 4K డాల్బీ అట్మాస్‌తో మళ్ళీ బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కథలను ఎప్పటికీ సజీవంగా ఉంచాలనే నాన్న గారి కలకు నివాళి.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ 'శివ' మళ్లీ బిగ్ స్క్రీన్ అదరగొట్టడానికి సిద్ధమైంది. ఈసారి అద్భుతమైన 4K విజువల్స్ తో పాటు, ఇప్పటి వరకు ఏ రీ-రిలీజ్ సినిమాకు లేని విధంగా, డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది. మోనో మిక్స్‌లో ఉన్న శివ సౌండ్‌ను అత్యాధునిక AI టెక్నాలజీతో రీ-మాస్టర్ చేసి, అడ్వాన్స్ డాల్బీ ఆట్మాస్‌లోకి మార్చారు.
‘శివ’ ప్రత్యేకత అప్పుడు తన టైమ్స్ లోని సాంప్రదాయాలను ధైర్యంగా చెరిపేసిన విధానం మాత్రమే కాదు, అప్పట్లోనే చేసిన అత్యాధునిక సౌండ్ డిజైన్ లోనూ ఉంది. ఇప్పుడు రీ-రిలీజ్లో తీసుకొచ్చిన టెక్నాలజీ అప్‌గ్రేడ్స్‌తో ఈ సినిమా మరో కొత్త అనుభవాన్ని అందించబోతోంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..ఈ సారి ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ వినని విధంగా, పూర్తిగా కొత్త అనుభూతిని పొందుతారు. ఆ అనుభవాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నాను.
శివ 4K డాల్బీ ఆట్మాస్ నవంబర్ 14 నుండి థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..