కోయంబత్తూరులో మొదటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్న జర్మనీ
- July 20, 2016
చెన్నై ఒడిషాలోని భువనేశ్వర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూర్ లను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని గతంలో జర్మనీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ముందుగా తమ ప్రాజెక్టును కోయంబత్తూరు నుంచి ప్రారంభించేందుకు జర్మనీ సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశం అయ్యారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ముందుగా కోయంబత్తూర్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.భారత్ లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని జర్మనీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే తమిళనాడు ముఖ్యంత్రి జయలలితను స్టేట్ సెక్రెటేరియల్ లో కలిసినట్లు తమిళనాడు ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సహాయం అందించేందుకు సంసిద్ధంగా ఉన్న జర్మనీ.. ముందుగా కోయంబత్తూర్ నుంచి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు జర్మన్ అంబాసిడర్ నే.. తెలిపారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తల ప్రాతినిథ్యంతో కూడిన ఓ బృదం జూలై 20న కోయంబత్తూర్ సందర్శించి, కోయంబత్తూర్ నగర మేయర్, ఇతర అధికారులతో మిగిలిన చర్చలు జరపనున్నట్లు తెలిపింది. ప్రాజెక్టులకు తమవంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నజర్మన్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమిళనాడులో బ్యాంకింగ్ గ్రూప్ కెఎఫ్ డబ్ల్యూ సహా.. మరిన్ని జర్మన్ కంపెనీలు పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్‌లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









