ఓజీ సెన్సార్ కంప్లీట్..
- September 22, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న (OG)అంచనాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.తమ ఓజాస్ గంభీరాను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని వేయి కళ్ళతో చూస్తున్నారు. అందుకే భాగంగానే, ఇవాళ శాంపిల్ గా ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ఒక్కో షాట్, ఒక్కో విజువల్ నెక్స్ట్ లెవల్ ఉండటంతో సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని ఫిక్స్ అయిపోతున్నారు. అదే నమ్మకంతో ఓజీ మేకర్స్ కూడా ఉన్నారు.
ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పకనే చెప్తున్నారు. తాజాగా ఓజీ సినిమాను సెన్సార్ కి పంపారు మేకర్స్. సినిమాలో యాక్షన్ అండ్ వైలెంట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో “A” సర్టిఫికేట్ ను జారీ చేశారు. దాంతో ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఓజాస్ ఊచకోత కన్ఫర్మ్ అని ఫిక్స్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక సినిమా రన్ టైం ను కూడా చాలా క్రిస్పీగా సెట్ చేశారు. ఓజీ కోసం కేవలం 154 నిమిషాల రన్ టైం ను ఫిక్స్ చేశారు. ఆడియన్స్ ఇక్కడకూడా బోర్ ఫీల్ అవకుండా ఒకదాన్ని మించి మరొక సన్నివేశం ఉండేలా ప్లాన్ చేశారట. గతంలో లెన్త్ విషయంలో జరిగిన పొరపాట్లను రిపీట్ చేయకూడని ఆడియన్స్ కి ఫుల్ జోష్ ఉండేలా సినిమా ఇవ్వాలని ఇలా ప్లాన్ చేశాడట సుజీత్. ఇవన్నీ చూస్తుంటే ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాదించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అసలైన రిజల్ట్ ఏంటి అనేది తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకు ఆగాల్సిందే.గల్ఫ్ లో “OG” సినిమా Phars Film Co. LLC ద్వారా విడుదల కానుంది
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి