OG విడుదల.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్టు
- September 25, 2025
మాస్ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఫ్యాన్స్ నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ సినిమా రిలీజ్‌ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రిలీజ్‌కి ముందు రోజే ప్రీమియర్ షోలు వేయగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమా కథనాన్ని దర్శకుడు సుజీత్ స్మార్ట్‌గా తెరకెక్కించారు.
కథ, సంగీతం, యాక్షన్ సన్నివేశాల సమన్వయం ప్రేక్షకులను తెరపై కట్టుబెట్టడం ముఖ్యంగా నిలిచింది. పవన్ కల్యాణ్ మాస్ లుక్ లో తన పాత్రలోని భావోద్వేగాలు, ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేస్తున్నాయి. ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికలో సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటూ, దర్శకుడు, హీరో, టెక్నీషియన్ల కృషిని ప్రశంసిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. “They Call Him OG మీ ముందుకు వచ్చింది.
ఎన్నో సంవత్సరాల ప్రయాణం చివరకు పూర్తైంది. ఉత్సాహంతో పాటు కొంత బాధ కూడా ఉంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నా డైరెక్షన్, టెక్నీషియన్ టీంకి ‘ఐ లవ్ యూ’! ఇంకా ఎంత చెప్పినా తక్కువే. నన్ను నమ్మిన మా నిర్మాతలు దానయ్య, కల్యాణ్ దాసరి, సినిమా కోసం ఎంతో కష్టపడ్డ తమన్ అన్నకి థ్యాంక్స్.
సినిమాటోగ్రాఫర్ నవీన్ నూలి బ్రో.. నీ మ్యాజిక్ తెర పై ఆడియన్స్ చూసే క్షణాన్ని నేను కూడా ఎదురుచూస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, మ్యాడ్నెస్ ఊహించలేనిది! ఇది కేవలం ఆరంభం మాత్రమే. అన్నీ బాగుంటే ‘ఓజీ’ ఇంకా పెద్దదిగా మారుతుంది. లవ్ యూ మై పవర్ స్టార్” అంటూ రాసుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల వద్ద పవన్ అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి, బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ‘పవన్ ఈజ్ బ్యాక్’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. స్టైలిష్ స్క్రీన్‌ప్లే, పవర్ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే నేపథ్య సంగీతంతో ‘ఓజీ’ చిత్రం మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తొలిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Storming in Cinemas near U…🧿♥️#OG #TheyCallHimOG pic.twitter.com/Bb7aYIeiTJ
— Sujeeth (@Sujeethsign) September 24, 2025

తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి