సినిమా రివ్యూ: ‘ఓజీ’

- September 25, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఓజీ’

పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్‌కెళ్లినా.. ఏ కార్యక్రమానికి హాజరైనా అక్కడ ఫ్యాన్స్ నుంచి వచ్చే మాట ‘ఓజీ’. గత కొంత కాలంగా ‘ఓజీ’పై ఫ్యాన్స్ అంతలా అభిమానం పెంచేసుకున్నారు. దాంతో, ఆటోమెటిగ్గా ‘ఓజీ’ సినిమాకి హైప్ పెరిగిపోయింది. ఎట్టకేలకు సినిమా పూర్తయ్యింది. రిలీజ్ అయిపోయింది. మరి, ఫ్యాన్స్ అంచనాల్ని, ఆశల్ని ‘ఓజీ’ ఫలించేలా చేసిందా.? లేదా.? తెలియాలంటే ‘ఓజీ’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:

ఈ సినిమా కథ జపాన్‌లో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ముంబయ్ పోర్ట్‌కి చేరుతుంది. ముంబై పోర్టును తన సామ్రాజ్యంగా చేసుకుని మంచి కోసం ప్రయత్నించే సత్య దాదా (ప్రకాశ్ రాజ్). అయనకు రక్షణగా వుండే యోధుడు ఓజస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్). కన్నతండ్రిలా చూసుకునే సత్య దాదాకి కొన్ని కారణాల వల్ల ఓజీ దూరం కావల్సి వస్తుంది. దాంతో, అక్రమార్కుల కన్ను ఓ పోర్టుపై పడుతుంది. తద్వారా అనేక అక్రమ కార్యకలాపాలకు ఆ పోర్టు అడ్డాగా మారుతుంది. అప్పుడు ప్రాణంలా చూసుకున్న దాదా కోసం పదేళ్ల తర్వాత పోర్టుకి తిరిగొచ్చిన ఓజీ ఏం చేశాడు.? అక్రమార్కుల ఆట ఎలా కట్టించాడు... జపాన్‌లోని యకోజాలకీ, సమురాయ్ వంశానికి చెందిన ఓజీకీ సంబంధం ఏంటీ.? ఓజీ అంటూ ముంబయ్‌కి ఎందుకంత టెర్రర్.? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘ఓజీ’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

పవన్ కళ్యాణ్ నుంచి ఓ సాలిడ్ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న అభిమానులకి ఈ సినిమా ఐ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. పవన్ కనిపించిన ప్రతీ షాట్ ఫ్యాన్స్‌కి సాలిడ్ ట్రీట్ ఇస్తుంది. ఇది కదా తమ అభిమాన హీరో నుంచి మేం ఎక్స్‌పెక్ట్ చేసింది.. అనేలా వుంటాయ్ ప్రతీ సీన్.. ప్రతీ షాట్. కటానా, కత్తి, గన్ను.. ఇలా అనేక రకాల  ఆయుధాలు వాడిన విధానంఫ్యాన్స్‌లో జోష్ నింపుతుంది. చాలా మంది పాత్రలు తెరపై కనిపిస్తారు. ప్రతీ పాత్ర గుర్తుండేలాగే వుంటుంది. కానీ, పవన్ వన్ మ్యాన్ షోలాగే  అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం ఆయన క్యారెక్టర్ తీర్చి దిద్దిన విధానం. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ పాత్ర చాలా చిన్నది. కానీ ఆశ్చర్యపరిచేలా వుంటుంది. గీత పాత్రలో కనిపించిన శ్రియా రెడ్డిది సర్‌ప్రైజింగ్ రోల్. ఆ పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేసింది శ్రియ రెడ్డి. ఒక అపార్డం ధ్వారా పవన్‌ని చంపాలనుకునే అర్జున్ పాత్రలో (అర్జున్ దాస్) నటన కీలకంగా అనిపిస్తుంది. అలాగే, సత్య దాదాగా తన అనుభవాన్ని రంగరించి మెప్పించాడు ప్రకాష్ రాజ్. మెయిన్ విలన్ పాత్ర పోషించిన ిఇమ్రాన్ హజ్మీ.. ఓమిగా సాలిడ్ పర్‌ఫామెన్స్ అందించాడు. హీరోతో పోటీ పడి నటించాడు. కానీ, అక్కడక్కడా ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఈ పాత్రను డిజైన్ చేసుంటే బాగుండేదనిపిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఫ్యాన్ బోయ్ సుజిత్.. తన తోటి ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్‌ని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగే తెరపై చూపించాడు. తన కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టేశాడు ఈ సినిమా కోసం సుజిత్. అందులో హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యాడు కూడా. ఓ పవర్ ప్యాక్‌డ్ ఫుల్ మీల్స్‌ని ‘ఓజీ’ ద్వారా ఫ్యాన్స్‌కి అందించేశాడు. నిద్రాణంలో వున్న ఫ్యాన్స్‌ని వంద రెట్ల ఉత్సాహంతో తట్టి లేపేశాడు. కథ, కథనం సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఒక్కొక్క షాట్‌ని స్టైలిష్‌గా పవర్ ఫుల్‌గా తీర్చి దిద్దిన విధానం వేరే లెవల్. సుజిత్‌కి తగ్గట్లుగానే థమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి ప్రాణం పెట్టేశాడు. ఇక, సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. చూపు తిప్పుకోనియ్వవు ప్రతీ సీన్‌లోనీ విజువల్స్. నిర్మాణ విలువలు ఎక్స్‌లెంట్. ఎడిటింగ్‌ విషయంలోనూ ఎక్కడా వేలెత్తి చూపించేలా వుండదు. ఓవరాల్‌గా ఈ సినిమాని టెక్నికల్ టీమ్ నెక్స్‌ట్ లెవల్‌లో నిలబెట్టిందనే చెప్పొచ్చు. పేరు పేరునా ప్రతీ ఒక్కరూ టెక్నికల్‌గా పర్‌ఫె్క్ట్ వర్క్ చేశారంతే.

ప్లస్ పాయింట్స్:

పవన్ కళ్యాణ్, యాక్షన్ ఎపిసోడ్స్, ఆయుధాలు వాడిన విధానం, స్టైలిష్ మేకింగ్.. సీన్ టు సీన్ ఎవ్రీ థింగ్ సో పర్‌ఫెక్ట్..

మైనస్ పాయింట్స్:

రొటీన్ కథ.. ఏదో చెప్పుకోవాలి కాబట్టి.. కథ గురించి చెప్పడం కానీ, కథనం నడిపిన తీరుతో ఆ సంగతి గుర్తే వుండదు. 

చివరిగా:

ఫ్యాన్స్‌కి అసలు సిసలు పవర్ ఫీస్ట్ ‘ఓజీ’. ఓజస్ గంభీర.! ఇప్పట్లో మరో పెద్ద సినిమా లేదు. రాదు. దసరా సెలవులు.. ఓ వైపు ఖచ్చితంగా ఈ సినిమా ధియేటర్లలో చూసి తీరాల్సిందే. ఒక్కసారి కాదు.. మళ్లీ మళ్లీ మళ్లీ చూస్తూనే వుండాలి. ఎంత చూసినా ఫ్యాన్స్‌కి తనివి తీరనంతలా.. సోలోగా.. ఫ్రెండ్స్‌తో, ఫ్యాన్స్‌తో.. ఫ్యామిలీతో.. ఇలా ఎన్నిసార్లయినా.. అదీ ‘ఓజీ’ మేనియా. లేట్ అయినా లేటెస్ట్‌గా వచ్చాడు ‘ఓజీ’.. సాలిడ్ హిట్టే కొట్టి వెళతాడంతే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com