వెస్టిండీస్ సిరీస్ కు టీం ఇండియా జట్టు ఇదే!
- September 25, 2025
వెస్టిండీస్‌తో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించింది. బోర్డు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్, ఆసియా కప్ సందర్భంగా దుబాయ్‌లో ఉన్న టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్‌లతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. సిరీస్‌లో రెండు టెస్టులు ఉండగా, వాటికి భారత జట్టును సజావుగా ఎంపిక చేశారు.
ఆసియా కప్ టోర్నీ కోసం దుబాయ్ లో ఉన్న భారత టెస్టు జట్టుసారథి శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తో అగార్కర్ తాజాగా భేటీ అయ్యారు. టెస్టు జట్టు కూర్పుపై వారితో చర్చించాక జట్టును ప్రకటించారు. రెండు టెస్టుల ఈ సిరీస్ లో టీమిండియా శుభ్ మన్ గిల్ (Shubhman Gill) సారథ్యంలో విండీస్ తో తలపడనుంది.వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజాను, రిషబ్ పంత్ స్థానంలో ఎన్.జగదీశన్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
ఇంగ్లాండ్ పర్యటనలో పెద్దగా రాణించని కరుణ్ నాయర్, శార్దూల్ ఠాకూర్ లను పక్కన పెట్టారు. కాగా, జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రెండు టెస్టులకూ అందుబాటులో ఉంటాడని అగార్కర్ పేర్కొన్నారు. షమీ ఫిట్‌నెస్‌పై ఇంకా అప్‌డేట్ రాలేదన్నారు. కరుణ్ నాయర్ తమ అంచనాలను అందుకోలేకపోయాడని అగార్కర్ చెప్పారు.
టీమిండియా జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదుత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (బ్యాకప్ వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్, జగదీశన్ (వికెట్ కీపర్), సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్.
తాజా వార్తలు
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్‌పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!