1,800 కు పైగా ఈ-కామర్స్ ఫిర్యాదులకు మోక్షం..!!

- September 25, 2025 , by Maagulf
1,800 కు పైగా ఈ-కామర్స్ ఫిర్యాదులకు మోక్షం..!!

మస్కట్: ఒమాన్ లో ఈ-కామర్స్ ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  ఈ ఏడాది జనవరి మరియు ఆగస్టు మధ్య వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) 1,851 ఈ-కామర్స్ ఫిర్యాదులను పరిష్కరించింది. ప్రభావితమైన వినియోగదారుల నుండి OMR24,500 కంటే ఎక్కువ రికవరీ చేసింది.   

సురక్షితమైన, న్యాయమైన మరియు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ఒమన్ విజన్ 2040 వైపు అడుగులు వేస్తుంది.  ఇందులో భాగంగా “మైదాన్” వ్యవస్థల ద్వారా ఇప్పుడు వినియోగదారులను ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. కేసును ట్రాక్ చేయడానికి వీలవుతుంది. ఇది ప్రజా సేవలను ఆధునీకరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా అధికారులు తెలిపారు.

ఇక 2025 మొదటి అర్ధభాగంలో సుల్తానేట్ అంతటా 3,141 వాణిజ్య ఉల్లంఘనలను CPA నమోదు చేసింది.  వీటిలో మస్కట్ 1,363 ఫిర్యాదులో టాఫ్ లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో  నార్త్ అల్ బటినా 754, సౌత్ అల్ బటినా–బార్కా 213 చొప్పున కేసులు నమోదైనట్లు వివరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com