భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!

- September 25, 2025 , by Maagulf
భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!

కువైట్: కువైట్‌లో భారత రాయబారిగా ఉన్న డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు పలికారు. తన మూడేళ్ల పదవీకాలంలో  భారత్-కువైట్ భాగస్వామ్యం , భారతీయ ప్రవాస కమ్యూనిటీపై ఆయన బలమైన ముద్ర వేశారు. తన పదవీ కాలంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేశారు. కువైట్‌లోని భారతీయ పౌరులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే సంస్కరణలను ప్రవేశపెట్టారు.  

ఆదర్శ్ స్కైకా కాలంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 43ఏళ్ల తర్వాత కువైట్ లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా హిస్ హైనెస్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మోడీకి కువైట్ అత్యున్నత పౌర గౌరవం అయిన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్‌ను ప్రదానం చేశారు.  ఇది భారత్-కువైట్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచడంలో నూతన అధ్యాయాన్ని నెలకొల్పింది. ఆయన  త్వరలోనే కెన్యా రిపబ్లిక్‌కు భారత హైకమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com