ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- September 28, 2025
దోహా: అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్ ను ప్రారంభించనున్నట్లు ఖతార్ విద్యామంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ సెంటర్లు జీవితాంతం నేర్చుకునే అవకాశాలను ప్రోత్సహిస్తాయని, సమాజంలోని అన్ని వర్గాలకు అనువైన విద్యా ఎంపికలను అందిస్తాయని తెలిపింది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిది కొత్త కేంద్రాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. వీటికి ప్రభుత్వ పాఠశాలలు అవసరమైన విద్యా, పరిపాలనా మరియు సాంకేతిక సిబ్బందిని సమకూర్చుతారని తెలిపింది.
అల్ అబ్, అల్ మామౌరా, ముయిథర్, అల్ వక్రా, అల్ షహానియా, ఐన్ ఖలీద్, అల్ మార్ఖియా, అల్ ఖోర్ మరియు అబు హమూర్ లలో త్వరలో అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఈ కేంద్రాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







