సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- September 29, 2025
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)/TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు స్థానిక సంబవాంగ్ పార్క్ లో సెప్టెంబర్ 27, శనివారం రోజున అత్యంత కోలాహలంగా కన్నుల పండుగగా జరిగాయి.ప్రత్యేక బతుకమ్మ సాంప్రదాయ పాటలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఆటపాటలతో ఎంతో హుషారుగా ఈ వేడుకలు అంబరాన్నంటాయి.
భారతదేశం నుండి వచ్చిన స్థానికుల తల్లిదండ్రులు మరియు బంధువులు కూడా ఈ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తమ సంతోషాన్ని తెలియజేశారు. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది అతిథులు మరియు ఎన్నారైలు సుమారు 2500 నుండి 3000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలలో పాల్గొన్న అంతర్జాతీయ శ్రీ కృష్ణ మందిరం (ISKM), సింగపూర్ వారికి మరియు వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గార్లకు TCSS సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, ఉపాధ్యక్షులు జూలూరి సంతోష్ కుమార్ మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ మరియు స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు దశాబ్దానికి పైగా సింగపూర్ లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వార బతుకమ్మ వైభవాన్ని చాటిచెప్పుతూ TCSS చరిత్రలో నిలిచిపోవడం జరిగిందని సొసైటీ సభ్యులు అన్నారు. TCSS తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన దాతలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి టీసీఎస్‌ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ కేటగిరీ కార్పొరేట్ మరియు వ్యక్తిగత దాతలను శాలువాలతో సన్మానించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
గత సంవత్సరాలతో పొలిస్తే ఈ ఏడాది ఆడపడుచులు బతుకమ్మలని పోటా పోటీగా చాలా అందంగా అలంకరించి వివిధ రూపాలలో 100 పైగా బతుకమ్మలని పేర్చి తీసుకొచ్చారు. బతుకమ్మని పేర్చి తెచ్చిన ప్రతి ఆడపడుచుని రెడ్ కార్పెట్ పై స్వాగతించి తనిష్క్ జ్యూవెల్లర్స్ వారి గిఫ్ట్ హాంపర్ని బహుమతిగా అందచేయడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దాదాపు 11 బతుకమ్మలకు మరియు ప్రత్యేక సాంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ముగ్గురు ఆడపడుచులకు సౌజన్య డెకార్స్ (వెండి వస్తువులు),BSK కలెక్షన్స్ (సారీస్) , K.S పట్టు ఫ్యాషన్స్ (సారీస్) మరియు వియోమి ఫ్యాషన్స్ (సారీస్) వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ప్రతి యేడు లాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ చెక్కిలిపై సిరివెన్నెల కురిసేరా...పూలకే పూజ చేసే పండుగే మళ్ళొచ్చేరా" యూట్యూబ్ లో విడుదల చేసినప్పడి నుండి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు.ఈ పాట మేకింగ్ కి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన స్థానిక ఏఐ పాల్స్ ప్రై.లి సంస్థ వారికి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.అలాగే ఈ వేడుకల్లో TCSS ప్రత్యేకంగా తయారు చేయించిన ఫోటోబూత్ మరియు కృత్రిమ బతుకమ్మ ఆకర్షణగ నిలిచాయి.
ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని ప్రణాళికతో సురక్షితంగా వేడుకలను నిర్వహించిన సొసైటీ వారికి ఈ పండుగలో పాల్గొన్న వారు తమ సానుకూల అభిప్రాయాన్ని కృతజ్ఞతల రూపంలో వాట్సాప్ మాధ్యమంలో తెలియజేసి అభినందించారు. వారందరి సానుకూల స్పందన కమిటీ సభ్యులను ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించడానికి ప్రోత్సహించింది. ఈ పండుగను నిర్వహించడానికి సింగపూర్ లోని బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్ ,పుంగ్గోల్ , టాంపనీస్ ,బెడోక్ , మేల్విల్లీ పార్క్ మరియు సెరంగూన్ ప్రాంతాల నుండి బస్సులను నామ మాత్రపు రుసుముతో సమకూర్చి పండుగను విజయవంతగా నిర్వహించడం జరిగింది. సింగపూర్ వేడుకలను సొసైటీ ఫేస్ బుక్ మరియు యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది.
బతుకమ్మ పండుగ లో పాల్గొన్న అందరికీ కమిటీ ఏర్పాటు చేసిన విందు భోజనంలో (ఉప్మా, పులిహోర ,పెరుగు అన్నం,కేసరి మరియు తందూర్ లాంజ్ అతేంటిక్ ఇండియన్ రెస్టారెంట్ వారి డబుల్ కా మీఠా) పెద్ద ఎత్తులో సంతోషంగా పాల్గొని అందరూ భోజనం చేశారు.
ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బొందుగుల ఉమా రాణి ,నంగునూరు సౌజన్య, బసిక అనిత రెడ్డి, హేమ లత, దీప నల్ల, జూలూరు పద్మజ,కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, ఎర్రమ రెడ్డి దీప్తి, హరిత విజాపుర్, సౌజన్య మాదారపు, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, రావుల మేఘన, చల్ల లత మొదలగు వారు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడం లో కీలక పాత్ర పోషించడం జరిగింది.
ఈ వేడుకలకు సహకారం అందించిన కార్పొరేట్ స్పాన్సర్స్ - మై హోమ్ గ్రూప్ కంస్ట్రక్షన్స్, మురాసు మాస్టర్ ఫైనాన్సియల్ కన్సల్టెంట్, సంపంగి రియాలిటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, జి.ఆర్.టి జ్యూవెల్లర్స్, ఏ టి ఎస్, ఏ.ఎస్.బి.ఎల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ప్రద్ ఈవెంట్ మేనేజ్ మెంట్, అభిరామి జ్యూవెల్లర్స్, గారెంటో అకాడమీ, వజ్ర బిల్డింగ్ వాల్యూస్, బులియన్ కింగ్,బంజారా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్,వైజ్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, గ్లోబస్ డెవలపర్స్ ,జోయాలుక్కాస్ జ్యూవెల్లర్స్, ఎవోల్వ్, టాటా విన్స్, కుమార్ ప్రాప్ నెక్స్ ,డెసిమల్, ఫీస్టా సింగపూర్ ట్రావెల్స్, సూపర్ డీలక్స్, తందూర్ లాంజ్ అతేంటిక్ ఇండియన్ రెస్టారెంట్, సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ & బిస్ట్రో, వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్ మరియు వ్యక్తిగత దాత లు ప్లాటినం కేటగిరీ : కామారెడ్డి మిత్రులు, సింగపూర్; గోల్డ్ కేటగిరీ : కీ||శే|| శ్రీ సత్యనారాయణ శివనాథుని (సతీష్) గారి మిత్రులు, విక్రం, అశోక్ ముద్దం & గాలి వెంకటరమణ & ఫ్రెండ్స్; సిల్వర్ కేటగిరీ:అలెక్స్ & నవీన్ , కరుణాకర్ రెడ్డి సురం, అనిల్ కుమార్ దూడం,నీలం రాకేష్ & మిత్రులు, కవిత ఆనంద్, వేణుగోపాల్ లాలంగర్, ఓలం వెంకటరమణ, మల్లేష్ బరపతి, సాయి కృష్ణ కొమాకుల, నాగానంద్ రాపోలు, సుజయ్ కుమార్ తోట, రాజ్ కుమార్ గొడిశాల, విజయ రామా రావు పోలినేని మరియు చింతకింది రమేష్ గార్లకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ పండుగ వేడుకలో భోజనం వడ్డించడానికి సహకారం అందజేసిన కల్వ లక్ష్మణ్ రాజు, మనోజ్ కుమార్ ఏదుళ్ల, లక్ష్మారెడ్డి గార్లపాటి, వెంకట్ ఓలం, సమ్మయ్య మొలుగూరి, చేతన్ తమ్మల, కిరణ్ రాచకొండ, జీవన్ రెడ్డి పొద్దుటూరి, వేణుగోపాల్ లాలంగర్, మార్తాండ్, సందీప్ రెడ్డి వల్లెపు, అనిల్ కుమార్ సాదు, నాగ శివకుమార్ సిరిపురపు, సురేష్ (ఫీస్టా సింగపూర్ ట్రావెల్స్), ప్రదీప్ కుమార్ చారి, హరి విక్కీ, సిన్న బొద్దుల , మహేష్ చెట్టిపల్లి, నీలం సుఖేందర్ , నరేష్ కుమార్ నౌల్ల, మహేష్ చెలెవేరి మరియు శ్రీకాంత్ పుల్లూరి లకు, వాలంటీర్స్ ఆర్థం సందీప్ కుమార్ , గిరి ప్రసాద్ అభిమల్ల, మల్లవేణి సంతోష్ కుమార్ లకు, బస్సులు సమన్వయ పరచడంలో సహకరించిన మనోజ్ కుమార్ ఏదుళ్ల, సాయి కృష్ణ కొమాకుల, అనిల్ కుమార్ దూడం, కిరణ్ కైలాసపు, కల్వ లక్ష్మణ్ రాజు, నీలం రాకేష్, నిఖిలేష్ నార్ల కు, పార్క్ యాజమాన్యానికి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బతుకమ్మలను మరియు సంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ఆడపడుచుల ఎంపికలో సహకరించిన మాధవి లాలంగర్, స్వప్న ముద్దం, సృజన బైస మరియు స్వప్నకైలాసపు గార్లకు, బతుకమ్మ ఆటకు కొరియోగ్రఫీగా సహకరించిన దీప రెడ్డి గార్లకు, వీడియో మరియు ఫోటోగ్రఫీ కి సహకరించిన సింగపూర్ తెలుగు టీవీ యాజమాన్యం రాధా కృష్ణ మరియు కృష్ణ నెల్లుట్ల కు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కాసర్ల శ్రీనివాస్, రవికృష్ణ విజాపుర్, ప్రవీణ్ కుమార్ సి.హెచ్ మరియు సాత్విక నడికట్ల & సంజన బొందుగుల (జూనియర్ కమిటీ మెంబెర్స్) లు పండుగ వేడుకల వ్యాఖ్యాతలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు