కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!

- September 30, 2025 , by Maagulf
కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!

రియాద్: సౌదీ అరేబియా కార్మికులకు శుభవార్త తెలిపింది. "పనికి గైర్హాజరు"గా నివేదించబడిన ప్రొఫెషనల్ కార్మికుల స్థితిని సరిచేసుకోవడానికి మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనుమతించింది. సెప్టెంబర్ 18 నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.

కొత్త తీసుకొచ్చిన Qiwa ప్లాట్ ఫామ్ ద్వారా కార్మికులు తమ స్టేటస్ ను మార్చుకోవచ్చని, ఇది కార్మికులు తమ స్పాన్సర్‌షిప్‌ను చట్టబద్ధంగా కొత్త యజమానికి బదిలీ చేసుకోవడానికి అనుమతిస్తుందని ప్రకటించారు. ఒప్పంద హక్కులను కాపాడటం, కార్మిక మార్కెట్ ఆకర్షణను పెంచే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com