ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- September 30, 2025
మస్కట్: ముసాండం గవర్నరేట్ 2025-2026 సంవత్సరానికి తన నాల్గవ శీతాకాల సీజన్ ప్రణాళికను వెల్లడించింది. నవంబర్లో వింటర్ సీజన్ ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగుతుంది. మస్కట్లో జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో పర్యాటక మంత్రి సలీం మొహమ్మద్ అల్ మహ్రౌకి పాల్గొన్నారు.
గవర్నరేట్లోని నాలుగు విలాయత్లు, లిమాలోని నియాబత్ మరియు కుమ్జార్ గ్రామంలో 60 కి పైగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి ప్రాంతీయ మరియు ప్రపంచ పర్యాటక పటంలో ముసాండం స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
ఇదే వేడుకలో 2024-2025 సీజన్ విజయానికి దోహదపడిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, మీడియా సంస్థలను ఎంపిక చేశారు. గత సీజన్ లో 7 లక్షల 89వేలకు పైగా పర్యాటకులు తరలించారు. తద్వారా ఒమన్ ఖజానాకు RO 251 మిలియన్ల ఒమన్ రియాల్స్ జమ అయినట్టు ముసందం గవర్నర్ సయ్యద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది తెలిపారు. 2025-2026 శీతాకాల సీజన్ ప్రాంతీయ, ప్రపంచ పర్యాటక పటంలో గవర్నరేట్ హోదాను పటిష్టం చేయడంలో ఒక కొత్త దశను సూచిస్తుందని, అసమానమైన పర్యాటక అనుభవాన్ని టూరిస్టులకు అందిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







