బెంగాలీ కార్మికులపై మినిస్ట్రీ వివరణ
- July 21, 2016
సోసల్ మీడియాలో బెంగాలీ కార్మికులపై వస్తున్న కథనాలపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించింది. బెంగాలీ కార్మికులు లేబర్ రిక్వైర్‌మెంట్స్ కోసం మినిస్ట్రీ ఎంపిక చేయడం జరిగిందనీ, వారిని సెక్యూరిటీ మరియు పోలీస్ వర్క్ నుంచి మినహాయించామని మినిస్ట్రీ వివరించింది. ఎలక్ట్రీషియన్లు, ఆటో మెకానిక్స్, ఇంజిన్ రిపేర్‌మెన్, పెయింటర్స్, కార్పెంటర్స్ తదితర విభాగాల్లో వినియోగిస్తున్నాం తప్ప, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన సెక్యూరిటీ మరియు పోలీస్ ఆపరేషన్స్‌లో ఉపయోగించడంలేదని అధికారులు స్పష్టం చేశారు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 293 మంది వర్కర్లు మరియు టెక్నీషియన్లు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌లో పనిచేస్తున్నారు. మరో 350 మంది రానున్న మూడేళ్ళలో ప్రతి ఏడాదీ అదనంగా తీసుకోబడ్తారని అధికారులు వెల్లడించారు.మినిస్ట్రీకి చెందిన సెక్యూరిటీ లేదా పోలీస్ డ్యూటీస్‌తో ఈ కార్మికులకు ఎలాంటి సంబంధం ఉండదని మినిస్ట్రీ చెప్పింది. పోలీస్ వాహనాల్ని వారెవరూ వినియోగించరనీ, మినిస్ట్రీ వారికి వాహనాల్ని ప్రత్యేకంగా సమకూరుస్తుందని తెలియవస్తోంది.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









