పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- September 30, 2025
యూఏఈ: అక్టోబర్ నెల కోసం ఇంధన ధరలను యూఏఈ ప్రకటించింది. ఆగస్టులో తగ్గిన తర్వాత సెప్టెంబర్లో ధరలు కొద్దిగా పెరిగాయి. కొత్త ధరలు అక్టోబర్ 1 నుండి వర్తిస్తాయి.
సూపర్ 98 పెట్రోల్ ధర సెప్టెంబర్లో Dh2.70 ఉండగా ఇప్పుడు లీటరుకు Dh2.77గా ఉంటుంది. ఇక స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.66గా ఉండనుంది. గత నెలలో దీని ధర Dh2.58గా ఉంది. E-ప్లస్ 91 పెట్రోల్ ధర సెప్టెంబర్లో Dh2.51 ఉండగా, ఇప్పుడు Dh2.58గా ఉంటుంది. డీజిల్ ధర Dh2.66 నుంచి Dh2.71కు పెరగనుంది.
ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్థిరమైన పెట్రోల్ ధరలు రవాణా ఖర్చులను మరియు ఇతర వస్తువుల ధరలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప పెట్రోల్ ధరలు కలిగిన 25 దేశాలలో యూఏఈ ఒకటిగా ఉంది. ఇప్పటికీ లీటరుకు సగటున Dh2.58 ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధరలను నియంత్రించడానికి 2015లో ఇంధన ధరలపై నియంత్రణను యూఏఈ తొలగించింది.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







