ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- September 30, 2025
మస్కట్: ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (FSA) ఒమన్‌లో సెక్యూరిటీలకు సంబంధించిన సేవలను అందించే అనధికార ప్లాట్‌ఫారమ్‌లు లేదా సంస్థలపై హెచ్చరికలు జారీ చేసింది. ఆయా సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు నోటీసు జారీ చేసిదిం. రెగ్యులేటర్ నుండి సరైన లైసెన్సింగ్ లేకుండా సెక్యూరిటీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న కంపెనీలు మరియు వ్యక్తుల అధికారిక జాబితాను విడుదల చేసింది.
ముఖ్యంగా వెబ్సైట్లు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పెట్టుబడి సేవలను అందిస్తున్నట్లు చెప్పుకునే సంస్థలు లేదా వ్యక్తులు సంప్రదించినప్పుడు జాగ్రత్త వహించాలని పెట్టుబడిదారులను కోరింది.
ఆర్థిక లావాదేవీలు చేసే ముందు ఏదైనా సంస్థ చట్టబద్ధతను ధృవీకరించాలని పెట్టుబడిదారులకు సూచించింది. లైసెన్స్ పొందిన సంస్థల అధికారిక FSA రిజిస్టర్‌ను చెక్ చేయాలని, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్స్ (IOSCO) జారీ చేసిన అంతర్జాతీయ హెచ్చరికలను అనుసరించాలని సూచించింది. ఒమన్‌లో సెక్యూరిటీ సేవలను అందించడానికి అనుమతి లేని కంపెనీ పేర్లు, వెబ్సైట్లు లేదా సోషల్ మీడియా ఖాతాల వివరాల కోసం FSA వెబ్ సైట్ ను చూడాలని కోరింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







