ఎయిర్ బస్‌కి ఏపీ నుంచి ఆహ్వానం...
- September 30, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తూ, ప్రముఖ అంతర్జాతీయ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాల్లో భాగంగా, తొలిసారిగా ఎయిర్ బస్ సంస్థ తమ బోర్డు సమావేశాన్ని భారత్‌లో నిర్వహించడం గమనార్హం. ఈ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్, ఏపీని గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని తెలియజేశారు. ఎయిర్ బస్ ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ, విమాన రంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, భూములు, కారిడార్లు అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
లోకేశ్ మాట్లాడుతూ, ప్రోగ్రెసివ్ ఏరోస్పేస్ పాలసీ, ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు, మల్టిపుల్ కారిడార్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులతో రాష్ట్రం సంపన్నంగా ఉందని వివరించారు. ఇకపోతే, అనుమతుల విషయంలో సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా వేగవంతమైన సేవలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
ఈ సమావేశానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో మెరుగైన భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలను వివరించారు.
ఏరోస్పేస్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏపీతో భాగస్వామ్యం ఎయిర్ బస్‌కు మేలే అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఎయిర్ బస్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్‌కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!