రమదాన్ సంబరం - మాంసం ధరలు మరింత ప్రియం!

- July 17, 2015 , by Maagulf
రమదాన్ సంబరం - మాంసం ధరలు మరింత ప్రియం!

ఈ సంవత్సరం రమదాన్ సందర్భంగా, బహ్రెయిన్ లో మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. బహ్రైన్ లైవ్ స్టాక్ కంపెనీ (BLC) వారి సమాచారం ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 1,40,000 గొర్రెల మాంసం, 5,500 బీఫ్ సరఫరా చేయబడ్డాయి. ఇది, గత సంవత్సరం కంటే 40 శాతం ఎక్కువని తెలిసింది. తమ వ్యయ నియంత్రణా చర్యలలో భాగంగా, ప్రభుత్వం మాంసంపై సబ్సిడీని ఆగస్టు 1 నుండి రద్దుచేయాలని, అందుకు బదులుగా బహ్రైన్ పౌరుల బాంకు ఖాతాలలోనే ఆ మొత్తం జమ ఔతుందని గతంలో ప్రకటించినప్పటికీ, పార్లమెంటు సభ్యుల నుండి వ్యతిరేకత వ్యక్తమవడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఐతే, ధరలు పెరుగుతాయనే భయంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఇంకా ప్రజలు మాంసం కొనుగోలుకు ఎగబడడం  ఈ పెరుగుదలకు కారణం అని BLC ఉపాధ్యక్షులు యూసిఫ్ అల్ సలేహ్ విశ్లేషించారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com