కెనడాలో భారతీయ సినిమాల పై దాడులు
- October 03, 2025
కెనడాలో భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్న థియేటర్ పై దుండగులు దాడి చేయడంతో కలకలం రేగింది. దక్షిణాసియాకు చెందిన సినిమాలు ప్రదర్శిస్తున్నందుకు వ్యతిరేకంగా ఈ చర్యలు జరిగినట్లు సమాచారం. ఈ హింసాత్మక ఘటనల తరువాత, థియేటర్ యాజమాన్యం తాత్కాలికంగా భారతీయ సినిమాల ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ 25న ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపు రంగు గ్యాస్ కేన్లతో వచ్చి, థియేటర్ ప్రవేశద్వారానికి మండే ద్రవాన్ని పోసి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో థియేటర్ మూసి ఉండటంతో ఎవరూ గాయపడలేదు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంది. భారతీయ సినిమాలను ప్రదర్శిస్తున్నందుకు ఇప్పటికే పలుమార్లు బెదిరింపులు ఎదుర్కొన్నామని వారు వెల్లడించారు. “ప్రేక్షకులకు సురక్షితమైన వాతావరణంలో వినోదాన్ని అందించడమే మా లక్ష్యం” అని యాజమాన్యం స్పష్టం చేసింది.
అయితే, ఒకే వారం వ్యవధిలో కాల్పులు, అగ్నిప్రమాద ప్రయత్నాలు జరగడంతో, ప్రేక్షకుల భద్రత కోసం తాత్కాలికంగా భారతీయ సినిమాల ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ పరిణామం స్థానిక భారతీయ సమాజంలో ఆందోళనకు కారణమైంది.
తాజా వార్తలు
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
- సోషల్ సెక్యూరిటీ..‘టెస్టాహెల్’ కార్డ్ ప్రారంభించిన ఖతార్..!!
- ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ అవార్డు ఫలితాలు వెల్లడి..!!
- హైదరాబాద్: మొదలైన ఉస్మానియా కొత్త ఆసుపత్రి పనులు
- కెనడాలో భారతీయ సినిమాల పై దాడులు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!