మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- October 04, 2025
మూడు పార్టీల ముఖ్యనేతలు. ప్రధాని మోదీ..ఏపీ సీఎం చంద్రబాబు..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. బీజేపీ నుంచి ప్రధాని మోదీ కీలక నేతగా ఆయన్ను ముందుపెట్టి ఏపీ పాలిటిక్స్‌లో సరికొత్త యాక్టివిటీని నడిపిస్తోంది కూటమి. టీడీపీ అధినేతగా చంద్రబాబు..జనసేన చీఫ్‌గా పవన్ కల్యాణ్ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 15 నెలలుగా మోదీతో పాటు బాబు, పవన్ ఒకే మాట..ఒకే బాటగా ముందుకు నడుస్తున్నారు.
కూటమి లాంగ్ లీవ్ అని ఇండికేషన్ ఇస్తూనే..నవ్యాంధ్ర డెవలప్‌మెంట్ మీద ఫోకస్ పెట్టింది. ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజల ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ..అభివృద్ధికి ప్రయారిటీ ఇస్తూ..ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంటున్నారు. అటు కూటమి ప్రభుత్వ పరంగా..టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పరంగా ఎవరి కార్యక్రమాలు అయినా..ఉత్తరాంధ్ర, రాయలసీమ, విజయవాడ కేంద్రంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే విజయవాడ, విశాఖలో మోదీ టూర్లు చేపట్టగా..ఇప్పుడు ఓవర్ టు రాయలసీమ అంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఏపీకి రానున్నారు. ఈ సారి మోదీ టూర్‌కు రాయలసీమ వేదిక కానుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు పీఎం. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న తర్వాత..చంద్రబాబు, పవన్‌తో కలిసి..కర్నూలులో రోడ్‌షో చేయనున్నారు మోదీ.
జీఎస్టీ సంస్కరణలపై జీఎస్టీ ఉత్సవ్ పేరుతో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం విశాఖలో గ్రాండ్‌గా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 15 వేల మందితో కలిసి మోదీ యోగా చేశారు. అంతకు ముందు ఈ ఏడాది మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరావతిలో రూ.49 వేల కోట్లతో చేపట్టే 74 పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
జనవరి 8న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేసిన పీఎం..సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో కలసి రోడ్‌షో నిర్వహించారు. అయితే ఏపీ ఎలక్షన్స్‌కు ముందు వైజాగ్‌లో ఈ ముగ్గురు లీడర్లు భారీ ర్యాలీ చేశారు. అందులో పబ్లిక్ పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీ సాధించింది.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..