రూ.10కే.. పది లక్షల బీమా..
- July 21, 2016
భారతీయ రైల్వే మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.10 కన్నా తక్కువ ప్రీమియంతో పది లక్షల వరకు ఇన్స్యూరెన్స్ కల్పించనుంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు రానున్న రైల్వే బడ్జెట్లో ఈ ప్రతిపాదన చేయనున్నారు. సెప్టెంబర్ నుంచి ట్రయల్ రన్‌గా దీన్ని అమలు చేయనున్నారు. తొలుత ఆన్లైన్లో టికెట్లు రిజర్వ్ చేసుకునే వారికి ఈ సదుపాయం కల్పిస్తారు. అనంతరం అన్ని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో దీన్ని అమలు చేస్తారు.
రైల్వే ప్రయాణికులకు స్వచ్చంధ బీమా పథకం కోసం 17 ఇన్యూరెన్స్ కంపెనీలతో ఐఆర్సీటీసీ చర్చిస్తోంది. వాటిలో మూడింటిని ఈ శుక్రవారం ఖరారు చేయనుంది. రైల్వే ప్రమాదాల్లో మరణం లేదా పూర్తిగా శాశ్వత వైకల్యం సంభవిస్తే పది లక్షల బీమా చెల్లిస్తారు. పాక్షిక వైకల్యం, తీవ్ర గాయాలకు రూ. 7.5 లక్షలు, ఆసుపత్రిలో చేరితే ఐదు లక్షలు చెల్లిస్తారు. మృతదేహం తరలింపు ఖర్చుల కింద పది వేల రుపాయలు అదనంగా అందజేస్తారు. ప్రయాణికులు కొంత అదనంగా చెల్లించి బీమా మొత్తాన్ని రూ.50 లక్షల వరకు పెంచుకునే అవకాశం కూడా రైల్వే శాఖ కల్పించనుంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







