కువైట్ లో పబ్లిక్ హైజిన్ ఉల్లంఘనలపై కొరడా..!!

- October 05, 2025 , by Maagulf
కువైట్ లో పబ్లిక్ హైజిన్ ఉల్లంఘనలపై కొరడా..!!

కువైట్: కువైట్ లో పబ్లిక్ హైజిన్ పట్ల అవగాహన ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ప్రజా పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపై భారీగా జరిమానాలు విధించనున్నట్లు కువైట్ మునిసిపాలిటీ అధికారిక ప్రతినిధి మొహమ్మద్ అల్-సిందాన్ తెలిపారు. బాధ్యతారహిత ప్రవర్తనల వల్ల పారిశుధ్య కార్మికులపై అధిక భారం పడుతుందని పేర్కొన్నారు.  ఈ సమస్యను పరిష్కరించడానికి ట్రాఫిక్, విద్యుత్, నీరు మరియు పర్యావరణ చట్టాల కింద నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానాలు విధిస్తామని తెలిపారు. 

స్ట్రీట్స్, బీచ్ లు, పబ్లిక్ మార్కెట్ లు ఇతర పబ్లిక్ ప్లేస్ లలో వ్యర్థాలను వేయవద్దని అధికారులు కోరారు. కువైట్ వ్యాప్తంగా పబ్లిక్ ఏరియాల్లో పరిశుభ్రతపై కఠినంగా ఉండనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు, కఠిన నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా కువైట్ ఇమేజ్‌ను పెంచుతాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com