ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!

- October 05, 2025 , by Maagulf
ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!

దోహా: దోహాలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తోపాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా, తమన్నా భాటియా, సునీల్ గ్రోవర్, ప్రభుదేవా, మనీష్ పాల్ మరియు స్టెబిన్ బెన్ వంటి ఆల్-స్టార్ లైనప్‌తో కలిసి “డా-బ్యాంగ్ ది టూర్ రీలోడెడ్”లో పేరిట లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు.

ఈ గ్రాండ్ కాన్సర్ట్  నవంబర్ 14న ఆసియన్ టౌన్ యాంఫిథియేటర్‌లో రాత్రి 8:00 గంటల నుండి ప్రారంభమవుతుంది.  టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయని నిర్వాహకులు తెలిపారు.   

సిల్వర్ కేటగిరి టిక్కెట్ల ధరలు QAR 150గా ఉండగా, గోల్డ్ QAR 200, డైమండ్ QAR 400, వీఐపీ QAR 750, వీవీఐపీ QAR 1,500, రెడ్ కార్పెట్ QAR 2,500, మీట్ & గ్రీట్ QAR 10,000 గా నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com