అమెరికాలో తూటాకు బలైన తెలంగాణ విద్యార్థి
- October 06, 2025
అమెరికా: అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన తెలుగు యువకుల వరుస మరణాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.డల్లాస్ లో దుండగుడి కాల్పుల్లో మీర్‌పేటకు చెందిన పోలే చంద్రశేఖర్ మరణించిన వార్త తెలిసి 48 గంటలు గడవక ముందే, మరో హైదరాబాదీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాలో 48 గంటల్లో రెండోసారి హైదరాబాద్ విద్యార్థి మరణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్ అనే విద్యార్థి అక్టోబర్ 5వ తేదీ (ఆదివారం) నాడు అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. షెరాజ్ చంచల్‌గూడ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవలే అమెరికాకు వెళ్లినట్లు సమాచారం.
ఇదే 48 గంటల్లో జరిగిన రెండో మృతి. అంతకు ముందు రోజు మరో హైదరాబాద్ విద్యార్థి 28 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్ పోలే టెక్సాస్‌లోని డల్లాస్‌లో కాల్పుల్లో మృతిచెందాడు. బీఎన్ నగర్‌కు చెందిన చంద్రశేఖర్ డల్లాస్‌లోని గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైమ్ పనిచేస్తూ తన ఖర్చులు నెట్టుకొచ్చేవాడు.
శనివారం తెల్లవారుజామున దొంగల దాడిలో ఆయన కాల్పులకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చంద్రశేఖర్ డెంటల్ సర్జరీలో పట్టా సాధించాడు. 2023 ఆగస్టు 21 నుంచి డెంటన్లోని నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో డేటా అనలిటిక్స్‌లో
మాస్టర్స్ చదువుతున్నాడు.చంద్రశేఖర్ మరణం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వ సహాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్
- అమెరికాలో తూటాకు బలైన తెలంగాణ విద్యార్థి
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ