కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!

- October 06, 2025 , by Maagulf
కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!

కువైట్: కువైట్ లో విద్యా సంబంధిత రంగాలపై కఠిన చట్టాలు అమల్లోకి వచ్చాయి. కార్మిక మార్కెట్‌ను నకిలీ అర్హతల నుండి రక్షించడానికి, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ విద్యా డిగ్రీల ప్రమాణికతను పెంచేలా కొత్త ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం ఉల్లంఘించినవారికి కఠినమైన శిక్షలను అమలు చేయనున్నారు.  ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 కువైట్ దినార్ల వరకు జరిమానా విధించనున్నారు. ఇక ఫేక్ డిగ్రీలను ఉపయోగించడం లేదా ఆమోదించడం వంటి వాటిల్లో పాల్గొన్నట్లు తేలిన ఉద్యోగులను విధుల జైలుశిక్ష, జరిమానాతోపాటు శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తారు.    

కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చిన డిగ్రీ సంబంధిత సర్టిఫికేట్లను ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వారి దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్న సమయంలో వారు ఒక సంవత్సరం వరకు తాత్కాలికంగా పని చేసే అవకాశాన్ని కల్పించారు. విద్యా సమగ్రతను బలోపేతం చేయడానికి, అర్హతల విశ్వసనీయతను నిలబెట్టడానికి కువైట్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com