దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- October 06, 2025
దోహా: యూకే నుండి ఇండియాకు వెళుతుండగా దోహాలో స్ట్రోక్‌కు గురైన వృద్ధ భారతీయ ప్రయాణీకుడి కోలుకున్నాడు. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లో అత్యవసర వైద్య సంరక్షణ తర్వాత సురక్షితంగా భారత్ కు తరలించారు. ఈ విషయాన్ని ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. ఈ సందర్భంగా ప్రయాణీకుడి అల్లుడు రాయబార కార్యాలయం అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు. UK నుండి భారతదేశానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపాడు. తాము ఫిట్-టు-ఫ్లై సర్టిఫికేట్ పొందే వరకు తమకు ఖతార్ లోని ఇండియన్ కమ్యూనిటీ బెనెవలెంట్ ఫోరం వారు అండగా నిలిచారని అన్నారు. ఈ మానవతా కార్యక్రమంలో భాగంగా సహకరించిన అన్నివర్గాలకు ఇండియన్ ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్‌లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!
- యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..
- రాస్ అల్ ఖైమాలో ప్రత్యేక వర్గాల కోసం ట్యాక్సీల సంఖ్య రెట్టింపు







