సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- October 06, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కు కొత్త లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా, ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ లోగో ఆవిష్కరణను 20వ జాతీయ సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా నిర్వహించారు. రాష్ట్రంలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనకు ఈ కొత్త లోగో ప్రతీకగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి పాల్గొన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆర్టీఐ కమిషనర్ పదవులను రేవంత్ రెడ్డి (RTI New Logo)ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసిన విషయం తెలిసిందే.
కొత్త కమిషనర్ల బృందం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రిని కలవడం, ఆర్టీఐ వ్యవస్థ మరింత బలపడుతుందనే సంకేతంగా పరిగణించబడుతోంది.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







