దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!

- October 06, 2025 , by Maagulf
దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!

దోహా: యూకే నుండి ఇండియాకు వెళుతుండగా దోహాలో స్ట్రోక్‌కు గురైన వృద్ధ భారతీయ ప్రయాణీకుడి కోలుకున్నాడు. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లో అత్యవసర వైద్య సంరక్షణ తర్వాత సురక్షితంగా భారత్ కు తరలించారు. ఈ విషయాన్ని ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. ఈ సందర్భంగా ప్రయాణీకుడి అల్లుడు రాయబార కార్యాలయం అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు. UK నుండి భారతదేశానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపాడు. తాము ఫిట్-టు-ఫ్లై సర్టిఫికేట్ పొందే వరకు తమకు ఖతార్ లోని ఇండియన్ కమ్యూనిటీ బెనెవలెంట్ ఫోరం వారు అండగా నిలిచారని అన్నారు.  ఈ మానవతా కార్యక్రమంలో భాగంగా సహకరించిన అన్నివర్గాలకు ఇండియన్ ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com