డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- October 07, 2025
హైదరాబాద్: తెలంగాణా లో ఇన్ఫర్టిలిటీ వైద్య విభాగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాని ఎంతో ప్రతిష్టాత్మకమైన టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్ 2025 ను డా.బంగారి రజనీ ప్రియదర్శిని అందుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ రాష్ట్ర స్థాయిలో వైద్య రంగంలో అత్యున్నత సేవలను అందించిన ప్రముఖ వైద్యులకు ప్రధానం చేస్తారు. కేవలం వైద్యమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యతను నిర్వర్తించే వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కరీంనగర్ కి చెందిన రజనీ ఫెర్టిలిటీ సెంటర్ చైర్మన్, ప్రముఖ వైద్య సంస్థ అయిన రెనే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సీనియర్ వైద్యులు డా.బంగారి రజనీ ప్రియదర్శిని ఈ అవార్డ్ ను నిన్న తాజ్ డక్కన్ హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఎల్.వి.ప్రసాద్ ఐ హాస్పిటల్ చైర్మన్ డా.నాగేశ్వర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా డా.రజనీ ప్రియదర్శిని మాట్లాడుతూ నేడు యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సంతానలేమి అని దానిని అధిగమించాలంటే ఆరోగ్య కరమైన జీవన విధానం, సరైన వ్యాయామం అవసరమని అన్నారు. ప్రతి సంవత్సరం తన అత్తగారైన కీ.శే.బంగారి లక్షీ స్మారకర్ధం పదిమంది దంపతులకు ఉచితంగా ఇన్ఫర్టిలిటీ వైద్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ఒక సాధారణ మద్యతరగతి కుటుంబం నుండి వచ్చిన తనకు ఈ అవార్డ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవార్డ్ తో తన బాధ్యత ఇంకా పెరిగింది అని అన్నారు. తనను ప్రతిక్షణం ప్రోత్సహిస్తూ ఈ అవార్డ్ రావడం సహకరించిన తన భర్త ప్రొఫెసర్ డా.బంగారి స్వామి మరియు కుటుంబ ప్రోత్సాహం, తన తల్లితండుల దీవెనలు ఉన్నాయని అన్నారు.ఈ సందర్భంగా రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డా. బంగారి స్వామి ప్రత్యేక అభినందలు తెలిపారు.
----నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- జీసీసీ-ఈయూ మధ్య భాగస్వామ్యం బలోపేతం..!!
- బంగారం ధరలు రికార్డ్-హై..!!