పొకెమాన్ గేమ్ వెనుక సీఐఏ కుట్ర...
- July 21, 2016
రష్యా-వీడియోగేమ్‌ను నిషేధించిన సౌదీ, కువైట్ తదితర దేశాలు న్యూయార్క్, జూలై 21: ప్రపంచవ్యాప్తంగా 26కు పైగా దేశాల్లో విడుదలైన ఆన్లైన్ రియాల్టీ గేమ్ పొకెమాన్ పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ఆధారంగా ఆడే ఈ గేమ్‌లో వాస్తవ ప్రదేశంలో ఒకరు పెట్టిన పొకెమాన్ చిత్రాన్ని జీపీఎస్ ద్వారా గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతుక్కొంటూ వెళ్లి ఆటగాళ్లు దానిని గుర్తించాల్సి ఉంటుంది. ఈ గేమ్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నదని సౌదీ అరేబియా మత పెద్దలు పొకెమాన్పై ఇప్పటికే ఉన్న ఫత్వాను పునరుద్ధరించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న మందుపాతర్లపై నడిచే ప్రమాదముందని ఈ గేమ్‌ను ఆడే ఆటగాళ్లను బోస్నియా హెచ్చరించింది. పొకెమాన్ గేమ్ అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కుట్రలో ఈ గేమ్ ఓ భాగమని రష్యా ఆరోపించింది. ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించడాన్ని కువైట్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా దేశాలు నిషేధించాయి. అలాగే వ్యక్తిగత సమాచారాన్ని పణంగా పెట్టొద్దని హెచ్చరించాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







