గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!

- October 10, 2025 , by Maagulf
గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!

మనామాః గాజాలో సంఘర్షణను ముగించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక  మొదటి దశను అమలు చేయడానికి ఒప్పందం కుదరడంపై బహ్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ మరియు హమాస్‌లను చర్చలకు ఒప్పించడంలో అధ్యక్షుడు ట్రంప్ మరియు అంతర్జాతీయ మధ్యవర్తుల ప్రయత్నాలను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభినందించింది. తమ నిబద్ధతలను నిలబెట్టుకోవాలని, ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయాలని మంత్రిత్వ శాఖ అన్ని పార్టీలకు పిలుపునిచ్చింది. గాజా నివాసితుల మానవతా పరిస్థితులు మరియు జీవన నాణ్యతను మెరుగుపరడానికి ప్రపంచ దేశాలు సహకరించాలని కోరింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com