NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి

- October 11, 2025 , by Maagulf
NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి

విజయవాడ: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విదేశ్ సంపర్క్ కార్యక్రమాన్ని స్థానిక వివంత హోటల్లో ఘనంగా నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెర్ఫ్, ఎమ్ఎస్ఎమ్ఎ, ఎన్ఆర్ఎ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ డయాస్పోరా అవసరాలను తీర్చడంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు.

కొత్త రాజధాని అమరావతిలో సంబంధిత శాఖ కార్యాలయాలు త్వరగా ఏర్పాటు చేయాలని విజప్తి చేశారు.ఎన్ఆర్టీ కమ్యూనిటీ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయం బలోపేతం కావాలని ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యంగా విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే కార్మికులు, మరణించిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర స్థాయి సమిష్టి కృషి అవసరమన్నారు. థాయిలాండ్, లావోస్, కాంబోడియా వంటి దేశాల్లో మోసపూరిత రిక్రూటర్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఎంబసీల సహకారం మరింత బలపడాలని అభ్యర్థించారు. మన రాష్ట్రం అక్వా ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్య ఆదాయానికి ప్రధాన భాగస్వామిగా ఉందని గుర్తుచేస్తూ, లీనితి సహకారంతో కొత్త మార్కెట్ల అభివృద్ధికి రోడ్మాప్ రూపొందించాలని సూచించారు.

విదేశీ విద్యార్థులకు పాస్పోర్ట్ సేవలు వేగవంతంగా అందించాలని, రాయలసీమ ప్రాంతానికి కడపలో కొత్త ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం (RPO) ఏర్పాటు చేయాలని కోరారు. విదేశాల్లో ఉపాధి అవకాశాలపై రాష్ట్రానికి సమాచారం అందించి, యువతకు శిక్షణ ఇప్పించడంలో ఎపిఎన్ఆర్, ఎంఇఎ కలిసి పనిచేయాలి అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎపిఎన్ ఆర్టి, ఎంబసీల మధ్య సమన్వ యం ద్వారా విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వలస కార్మికులకు గుర్తింపు, సహాయం అందిం అవసరముందని చాల్సిన తెలిపారు.ఎన్నారైల పెట్టు బడులను ప్రోత్సహించేందుకు, అమరావతిలో ప్రవాస భారతీయ దివాస్” నిర్వహించాలని విజప్తి చేశారు. లీనితి భవన సముదాయం నిర్మాణాన్ని అమరావతిలో త్వరితగతిన ప్రారంభించాలని, తద్వారా రాష్ట్ర ప్రజలకు అన్ని సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉంటాయని మంత్రి సూచించారు. దేశ విదేశాలు వెళ్లేందుకు మెడికల్ టెస్ట్ లకు హైదరాబాద్ వెళ్లకుండా మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ఏమైనా సమస్యలు ఎదురైతే త్వరితగతిన పరిష్కరించేందుకు నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నారైలకు మెరుగైన సేవలు, ఉపాధి, విద్య, పెట్టుబడుల రంగాల్లో కేంద్ర-రాష్ట్ర స్థాయిలో సమన్వయం బలోపేతం కావడం రాష్ట్రానికి మేలుచేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు, ఏపీఎన్ఆర్టీ అధికారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com