భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం

- October 12, 2025 , by Maagulf
భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం

న్యూ ఢిల్లీ: భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టిందని, ఈ మార్పుకు ప్రధాన కారణం ఇరు దేశాల బలమైన నాయకత్వమని అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ అన్నారు.ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి రాయబారిగా గోర్‌ను నియమించగా, ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించకముందే ఢిల్లీలో పర్యటిస్తూ కీలక సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

38 ఏళ్ల వయసులోనే రాయబారిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా గోర్ అమెరికా చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన రాయబారిగా రికార్డు సృష్టించారు. ట్రంప్‌ (Donald Trump) కి సన్నిహిత మిత్రుడిగా పేరుపొందిన ఆయన, గతంలో అమెరికా రాజకీయ వ్యవస్థలో పలు కీలక పదవులు చేపట్టారు. దౌత్యవేత్తగా ఆయన నియామకం భారత్-అమెరికా సంబంధాలకు నూతన దిశనివ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అక్టోబర్ 9న ఢిల్లీ చేరుకున్న సెర్గియో గోర్, తన ఆరు రోజుల పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలతో సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com