‘తెలుసు కదా’ కు యూఏ సర్టిఫికేట్
- October 13, 2025
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ యూనిక్ లవ్ స్టొరీ “తెలుసు కదా” ఈ దీపావళికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 17న విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని ‘U/A’ సర్టిఫికేట్ పొందింది.
ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.
సెన్సార్ టాక్ ప్రకారం, చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్స్ట్ రావండతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా రన్‌టైమ్ 2 గంటల 16 నిమిషాలు, ఎలాంటి లాగింగ్ లేకుండా రేసీగా, ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది,
సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా పాత్రలు యువతరానికి కనెక్ట్ అయ్యేలా ఈ ప్రేమకథ సాగనుంది. కథలో ఊహించని మలుపులు, భావోద్వేగాలు ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.
సిద్ధు తన స్వాగ్ చార్మ్ ఎనర్జీతో ఆకట్టుకోనున్నాడు. శ్రీనిధి, రాశీ గ్లామర్‌తో అలరించబోతున్నారు. వైవా హర్ష తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించనున్నారు.
ఇప్పటికే ఎస్ థమన్ కంపోజ్ చేసిన రెండు పాటలు వైరల్ అవడంతో మ్యూజిక్ సినిమా మీద మరింత బజ్ క్రియేట్ చేసింది.
“తెలుసు కదా” ఈ దీపావళికి రొమాన్స్, ఫన్, ఫీల్, సోషల్ మెసేజ్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!