'ఆంధ్ర కింగ్ తాలూకా' హోల్సమ్ టీజర్ రిలీజ్
- October 13, 2025
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్ హీరోగా కనిపించనున్నారు. వివేక్ & మెర్విన్ సంగీతం అందించారు. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచాయి. ఈరోజు, మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. రామ్ క్యారెక్టర్, సినిమా కథాంశం గురించి ఒక గ్లింప్స్ ఇచ్చారు.
రామ్ సినిమాలను ఆరాధిస్తూ, ఆంధ్ర కింగ్ ని ఆరాధిస్తూ పెరుగుతాడు. అంకితభావంతో ఉన్న అభిమానిగా, అతను తన అభిమాన స్టార్ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటాడు. అతనిని సమర్థిస్తూ గొడవల్లో కూడా పాల్గొంటాడు. అతను తన హీరోని ఎంతగా ప్రేమిస్తాడో, అంతే తీవ్రంగా అతన్ని ప్రేమించే ఒక అమ్మాయి ఉంది. మురళి శర్మ చెప్పిన హార్డ్ హిట్టింగ్ డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది.
రామ్ పోతినేని ఈ చిత్రంలో ఒక సినిమా అభిమాని పాత్రలో ఒదిగిపోయారు. ప్రతి హీరో అభిమానికి ఈ పాత్రలో తామే ఉన్నట్టు అనిపించేలా నటించారు. తన ఎనర్జీ తో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భాగ్యశ్రీ బోర్స్ రామ్ లవ్ క్యారెక్టర్ లో గ్రేస్‌ఫుల్, ఎమోషనల్ గా కనిపించింది. రామ్ తల్లిదండ్రులుగా రావు రమేష్, తులసి బాగా నటించారు. రామ్ స్నేహితుడిగా సత్య హ్యుమర్ అందించగా, ఒక సీన్లో మురళీ శర్మ ఆకట్టుకున్నారు.
తన తొలి చిత్రంతోనే మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు మహేశ్ బాబు పి, ఈసారి మరో యూనిక్ కథను అందిస్తున్నారు. ఆయన డైలాగులు బలంగా, ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతున్నాయి. టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు.
సిద్ధార్థ్ నూని సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. వివేక్–మర్విన్ సంగీతం టీజర్ టోన్‌కి తగినట్టుగా మారుతూ, కథను మరింత ఎట్రాక్టివ్ గాన వుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా అద్భుతమైన వర్క్ అందించారు.
ఇది సినిమాను వేడుకలా జరుపుకునే చిత్రం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. భారీ అంచనాలతో ఆంధ్ర కింగ్ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్
సాంకేతిక సిబ్బంది:
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి.
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ & టి-సిరీస్ ఫిలిమ్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ & మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి తుమ్మల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!