బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!

- October 13, 2025 , by Maagulf
బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!

మనామా: సల్మాబాద్‌లోని గోల్డెన్ ఈగిల్ క్లబ్‌లో బహ్రెయిన్ ఇండియా కల్చరల్ & ఆర్ట్స్ సర్వీసెస్ (BICAS) నిర్వహించిన దీపావళి వేడుకను ఘనంగా జరుపుకుంది. ఇది సంప్రదాయం, ఐక్యత మరియు పండుగ స్ఫూర్తిని ప్రదర్శించింది. ప్రవాస భారతీయ సమాజాన్ని ఒకచోట చేర్చింది.  ఈ వేడుకను బహ్రెయిన్‌లోని భారత రాయబారి వినోద్ కె. జాకబ్ అధికారికంగా ప్రారంభించారు. శాంతి, సామరస్యానికి దీపావళి పండుగ ఒక స్ఫూర్తి అన్నారు.

భారత సాంస్కృతిక వారసత్వం మరియు ఏకీకరణను ప్రోత్సహించడంలో కమ్యూనిటీ పాత్ర అద్భుతమని BICAS అధ్యక్షుడు భగవాన్ అసర్పోటా అన్నారు. ఈ దీపావళి వేడుక మన సాంస్కృతిక సంప్రదాయాలను సజీవంగా ఉంచడంలో BICAS నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని అన్నారు.  ఈ వేడుకలు ఉదయం రంగోలి పోటీతో ప్రారంభమయ్యాయి.  సాయంత్రం సాంప్రదాయ నృత్యాలు, సంగీతం మరియు జానపద కళలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com