ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్

- October 13, 2025 , by Maagulf
ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార పౌర సంబంధాల శాఖలో కీలక మార్పులు చేసింది. కొత్త కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన అధికారికంగా పనులను ప్రారంభించారు. ఈ నియామకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సమాచార వ్యవస్థ మరింత సమర్థవంతంగా నడవాలని ఆశిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న హిమాన్షు శుక్లాను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయడంతో ఆ స్థానంలో తాత్కాలికంగా ప్రఖర్ జైన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో సమాచార శాఖలో ఉన్న అధికార బాధ్యతల్లో ఈ తరహా మార్పులు చోటుచేసుకున్నాయి. 

ఇటీవల ప్రభుత్వం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా పనిచేస్తున్న కె.ఎస్.విశ్వనాథన్‌  ను ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన విశ్వనాథన్ గతంలో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్‌గా,

నరసాపురం సబ్ కలెక్టర్‌గా, అలాగే ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా సేవలందించారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన శాఖ కార్యకలాపాలు, విధుల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌ను అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com