సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!

- October 13, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!

రియాద్: సౌదీ హెరిటేజ్ కమిషన్ జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్‌లో 1,516 కొత్త పురావస్తు ప్రదేశాలను నమోదు చేశారు. దీంతో మొత్తం పురావస్తు ప్రదేశాల సంఖ్య 11,577కి చేరకుంది. సౌదీ అరేబియా అంతటా పురావస్తు ప్రదేశాలను డాక్యుమెంట్ చేయడం మరియు సంరక్షించడంలో కమిషన్ పనిచేస్తుంది. కొత్త ప్రదేశాలలో రియాద్ నుంచి 1,174 సైట్లు, అల్-బహాలో 184 సైట్లు, తబుక్‌లో 85 సైట్లు, ఉత్తర సరిహద్దుల్లో 70 సైట్లు మరియు జెడ్డాలో మూడు సైట్లు ఉన్నాయి.  

ఇప్పటివరకు నమోదు కాని పురావస్తు ప్రదేశాలను పురావస్తు సైట్ రిపోర్టింగ్ సర్వీస్ ద్వారా, అలాగే కమిషన్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లు, స్థానిక శాఖల ద్వారా నివేదించాలని పౌరులు మరియు నివాసితులు కోరింది. జాతీయ వారసత్వాన్ని రక్షించడంలో మరియు అభివృద్ధి చేయడంలో కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ఇది పెంపొందిస్తుందని హెరిటేజ్ కమిషన్ తన ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com